ప్రతిభ చాటాలంటే శాస్త్ర పరిజ్ఞానం తప్పనిసరి
eenadu telugu news
Published : 17/09/2021 00:34 IST

ప్రతిభ చాటాలంటే శాస్త్ర పరిజ్ఞానం తప్పనిసరి

విద్యార్థిని సన్మానిస్తున్న ఎస్‌సీˆఈఆర్‌టీ సభ్యులు

కొడంగల్‌, న్యూస్‌టుడే: దౌల్తాబాద్‌, న్యూస్‌టుడే: విద్యార్థులు శాస్త్ర పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ఉన్నత స్థితికి చేరాలని ఎస్‌సీˆఈఆర్‌టీ గణిత, విజ్ఞానశాస్త్ర పరిశోధక బృందం సభ్యులు ఉమారాణి, సురేష్‌బాబు, జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని గోకపాస్లాబాద్‌లో ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న అశోక్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జాతీయస్థాయి సైన్స్‌ఫేర్‌లో విద్యార్థి మూడోస్థానం సాధించడం అభినందనీయమన్నారు. అనంతరం విద్యార్థి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడారు. తమకు ఆసక్తి ఉన్న రంగాలను ఎంపిక చేసుకుని రాణించాలని విద్యార్థులకు సూచించారు. వినూత్న ఆలోచనలే ముందు వరసలో నిలబెడతాయన్నారు. విద్యార్థులు మరెన్నో ప్రయోగాలు చేసి పాఠశాలకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు హన్మప్ప, ఉపాధ్యాయులు శాంతకుమార్‌, విద్యార్థులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని