ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో ఘనంగా స్నాతకోత్సవం
eenadu telugu news
Published : 17/09/2021 02:29 IST

ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో ఘనంగా స్నాతకోత్సవం

ప్రతిభ కనబరిచిన అధికారులతో ఎయిర్‌ మార్షల్‌ సంజీవ్‌కపూర్‌

కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలోని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (ఏటీసీఓటీఈ)లో 12 వారాల పాటు కొనసాగిన 139వ ఎయిర్‌ ట్రాఫిక్‌ సర్వైలెన్స్‌ సర్వీసెస్‌ (ఏటీఎస్‌ఎస్‌) కోర్సు ముగిసింది. ఈ సందర్భంగా ఏటీసీఓటీఈలో గురువారం స్నాతకోత్సవాన్ని నిర్వహించినట్లు రక్షణ పౌర సంబంధాల అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అకాడమీ కమాండెంట్‌, ఎయిర్‌ మార్షల్‌ సంజీవ్‌కపూర్‌ కోర్సు పూర్తి చేసుకున్న 16 మంది అధికారులకు ధ్రువపత్రాలు, బహుమతులు అందజేశారు. ఈ కోర్సులో వైమానిక దళానికి చెందిన 12 మంది, నావికా దళానికి చెందిన ముగ్గురితోపాటు స్నేహపూర్వక దేశమైన కెన్యా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఒక అధికారి శిక్షణ పూర్తి చేసుకున్నారని అధికారులు తెలిపారు. ప్రాక్టికల్స్‌లో స్క్వాడ్రన్‌ లీడర్‌ ఎస్‌పీ పవిత్రన్‌, థియరీలో ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ జస్లీన్‌కౌర్‌ వాలియాలు ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు అధికారులు పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని