గండిపేట జలాశయం గేట్లు మూసివేత
eenadu telugu news
Published : 17/09/2021 02:29 IST

గండిపేట జలాశయం గేట్లు మూసివేత

ఈనాడు, హైదరాబాద్‌: ఇటీవల కురిసిన భారీ  వర్షాల కారణంగా తెరిచిన ఉస్మాన్‌ సాగర్‌ (గండిపేట) జలాశయం గేట్లను గురువారం మధ్యాహ్నం మూసివేసినట్లు అధికారులు తెలిపారు. వరద రావడంతో ఈనెల 4 తేదీ నుంచి నాలుగు గేట్ల ద్వారా మూసీలోకి నీటిని విడిచి పెడుతూ వచ్చారు. పై నుంచి ప్రవాహం క్రమేపీ తగ్గడంతో తాజాగా అన్ని గేట్లను మూసివేశారు. ప్రస్తుతం నీటి మట్టం 1788.75 అడుగుల వరకు ఉంది. మరోవైపు హిమాయత్‌ సాగర్‌లోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక గేటు ద్వారా 350 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే రెండుసార్లు జంట జలాశయాల గేట్లు తెరవడం విశేషం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని