పరిచయం ఉన్న వ్యక్తే అంతమొందించాడు
eenadu telugu news
Updated : 17/09/2021 11:13 IST

పరిచయం ఉన్న వ్యక్తే అంతమొందించాడు

మృతురాలు కొమ్ము పోచమ్మ              నిందితుడు నేనావత్‌ జైపాల్‌నాయక్‌

ఆమనగల్లు, న్యూస్‌టుడే: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం మాలేపల్లి శివారులో మంగళవారం రాత్రి జరిగిన కొమ్ము పోచమ్మ (39) హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆమనగల్లు ఠాణాలో గురువారం సీఐ ఉపేందర్‌తో కలిసి షాద్‌నగర్‌ ఏసీపీ కుషాల్కర్‌ వివరాలు వెల్లడించారు. మాడ్గుల మండలం చంద్రాయన్‌పల్లికి చెందిన కొమ్ము పోచమ్మ (39) ఆమనగల్లు ముర్తూజపల్లికి చెందిన గాలయ్య దంపతులు. వీరికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తెకు వివాహం చేశారు. పోచమ్మ గోషామహల్‌లో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. భర్త గాలయ్య, పిల్లలతో కలిసి చంద్రాయన్‌పల్లిలో ఉంటున్నారు. పోచమ్మ మంగళవారం సాయంత్రం విధులు ముగించుకొని ఆమనగల్లుకు చేరుకుంది. చంద్రాయన్‌పల్లి వెళ్ళడానికి ఆమనగల్లులోని ఆటో స్టాండ్‌లో నిరీక్షిస్తోంది. గతంలో పరిచయం ఉన్న ఆమనగల్లు చికెన్‌ సెంటర్‌లో పనిచేసే సాకిబండతండాకు చెందిన నేనావత్‌ జైపాల్‌నాయక్‌ (30) అక్కడికి వచ్చి పోచమ్మను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని మాలేపల్లి శివారులోని ఓ నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లాడు. ఇద్దరూ మద్యం తాగారు. ఆమెపై లైంగికదాడికి పాల్పడి అనంతరం కత్తితో గొంతుకోసి హత్యచేశాడు. కడియాలు, చెవి కమ్మలు తీసుకుని ఉడాయించాడు. ఫోన్‌ కాల్‌ డేటా ఆధారంగా జైపాల్‌నాయక్‌కు పట్టుకుని విచారించారు. పోచమ్మ తనకు గతంనుంచి పరిచయం ఉందని తరచూ ఫోన్‌చేసి డబ్బులు ఇవ్వాలని వేధించడంతో హత్య చేశానని చెప్పినట్లు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని