‘వైద్య సేవల్లో తెలంగాణ నంబర్‌ వన్‌’
eenadu telugu news
Published : 17/09/2021 02:29 IST

‘వైద్య సేవల్లో తెలంగాణ నంబర్‌ వన్‌’

నవజాత శిశువులకు తల్లిపాలు అందించేందుకు‘ధాత్రి తల్లి పాల నిధి’ సంచార వాహనాన్ని రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌(సీఎఫ్‌డబ్ల్యూ) కరుణ వాకాటి, సినీ నటి నభా నతేష్‌ గురువారం ప్రారంభించారు. సుషేనా హెల్త్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు డా.శ్రీనివాస్‌ ముర్కి, ధాత్రి తల్లిపాల బ్యాంక్‌ సంచాలకులు డా.కె.సంతోష్‌కుమార్‌ మాట్లాడుతూ.. ప్రతి రోజు సుమారు 5 లీటర్ల పాలు నిల్వచేసి సుమారు 100 మంది నవజాత శిశువులకు అందిస్తున్నామన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ మహిళా కళాశాల ప్రిన్సిపల్‌ ప్రొ.ఎం.విజ్జులత, వైస్‌ ప్రిన్సిపల్‌ ప్రొ.కవితా, ఎన్‌సీసీ అధికారి వి.దీపికారావు, ధాత్రి సంస్థ డైరక్టర్‌ కాశీనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

-న్యూస్‌టుడే, సుల్తాన్‌బజార్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని