రైల్వే ప్రయాణికులకు ‘ఎలక్ట్రిక్‌’ ఆటో సేవలు
eenadu telugu news
Published : 17/09/2021 02:29 IST

రైల్వే ప్రయాణికులకు ‘ఎలక్ట్రిక్‌’ ఆటో సేవలు


ఆటోతో మహిళా డ్రైవరు మీనా

కాచిగూడ, న్యూస్‌టుడే: రైల్వే ప్రయాణికులకు ఎలక్ట్రిక్‌ ఆటో సేవలు అందుబాటులోకి వచ్చాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే తొలిసారిగా నగరంలోని కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఎలక్ట్రిక్‌ ఆటో సేవలను గురువారం ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాచిగూడ రైల్వే స్టేషన్‌ నుంచి ఎలక్ట్రిక్‌ ఆటోలను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ఇటో మోటార్స్‌తో రెండేళ్ల క్రితం ఒప్పందం చేసుకుంది. తాజాగా అనుమతి లభించడంతో తొలి దఫాలో రెండు ఆటోలను నడపాలని చర్యలు తీసుకున్నట్లు ఇటో మోటార్స్‌ ప్రెసిడెంట్‌ వేణుగోపాల్‌రావు నెల్లుట్ల తెలిపారు. సంబంధిత ఆటోలు 24 గంటలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్‌ డివిజన్‌ మేనేజర్‌ (డీఆర్‌ఎం) శరత్‌ చంద్రాయన్‌ పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎలక్ట్రిక్‌ ఆటోను నడపడానికి ఆర్టీఏ అనుమతి ఇచ్చిన మొదటి మహిళా డ్రైవర్‌ మీనా కావడం విశేషం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని