సెప్టిక్‌ ట్యాంక్‌ గుంతలో పడి బాలుడి మృతి
eenadu telugu news
Published : 17/09/2021 02:29 IST

సెప్టిక్‌ ట్యాంక్‌ గుంతలో పడి బాలుడి మృతి


యువరాజ్‌యాదవ్‌

శామీర్‌పేట, న్యూస్‌టుడే: సెప్టిక్‌ ట్యాంక్‌ కోసం తవ్విన గుంతలో పడి బాలుడు దుర్మరణం చెందిన ఘటన శామీర్‌పేట ఠాణా పరిధిలో గురువారం వెలుగుచూసింది. ఇన్‌స్పెక్టర్‌ వి.సుధీర్‌కుమార్‌, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌ నుంచి రాజ్‌కుమార్‌ యాదవ్‌, భార్య పిల్లలతో శామీర్‌పేట మండలం తుర్కపల్లికి 15 రోజుల కిందట జీవనోపాధికి వచ్చారు. ఓ స్థిరాస్తి వెంచర్‌లో గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. వారికి ముగ్గురు సంతానం. చిన్న కుమారుడు యువరాజ్‌యాదవ్‌(5)ను వెంట తీసుకొచ్చారు. ఈ నెల 15న తల్లిదండ్రులు గుడిసెల సమీపంలోనే పనులు చేస్తూ ఆరేళ్ల ధనుకుమార్‌ అనే బాలుడి వద్ద వదిలారు. అక్కడే సెప్టిక్‌ ట్యాంక్‌ కోసం గుంత తవ్వారు. వాన నీటితో అది నిండింది. ఇద్దరు చిన్నారులు గుంత వద్ద ఆడుతూ ప్రమాదవశాత్తు యువరాజ్‌యాదవ్‌ అందులో పడిపోయాడు. సాయంత్రం పని ముగించుకొని ఇంటికి వచ్చిన రాజ్‌కుమార్‌యాదవ్‌ దంపతులకు బాబు కన్పించలేదు. రాత్రి శామీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. తరువాత సమీపంలోని సెప్టిక్‌ ట్యాంకు కోసం తవ్విన గుంతలో బాలుడి మృతదేహం బయటపడింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని