అనుమానం పెనుభూతమై..
eenadu telugu news
Published : 17/09/2021 02:29 IST

అనుమానం పెనుభూతమై..

 భార్య హత్య.. అడ్డొచ్చిన అత్త బలి

కార్ఖానా, న్యూస్‌టుడే: అనుమానం పెనుభూతమై భార్యను, అడ్డొచ్చిన అత్తనూ ఓ వ్యక్తి కత్తితో నరికి చంపాడు. ఈ ఘటన తిరుమలగిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం జరిగింది. సీఐ శ్రావణ్‌కుమార్‌ కథనం ప్రకారం తిరుమలగిరి మిలటరి ఆసుపత్రి సమీపంలోని క్వార్టర్స్‌లో ఉండే చిన్నబాబు(38), పుష్పలత(30) దంపతులు. వీరికి తొమ్మిదేళ్ల కుమార్తె, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. చిన్నబాబు మిలటరీ ఆసుపత్రిలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుండగా, పుష్పలత నర్సుగా పనిచేస్తోంది. ఆమె ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని తరచూ గొడవపడేవాడు. గురువారం సైతం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో పుష్పలతతోపాటు ఆమె తల్లి కుమారి(50) వారింట్లో ఉంది. ఆమె కూడా అదే ఆసుపత్రిలో ఆయాగా పనిచేస్తుంది. గురువారం వారిద్దరి మధ్య గొడవ జరగ్గా కుమారి అడ్డుపడింది. కోపోద్రిక్తుడైన చిన్నబాబు కత్తితో మొదట కుమారిపై, ఆపై భార్య పుష్పలత తలపై, మెడపై నరికాడు. తీవ్రగాయాలతో తల్లీకుమార్తె అక్కడికక్కడే మృతిచెందారు. చిన్నబాబు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తల్లి, అమ్మమ్మలు హత్యకు గురికావడం తండ్రి పరారీలో ఉండడంతో ఇద్దరు పిల్లలు తాత దగ్గరున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని