Kishan Reddy: భాజపా అధికారంలోకి వస్తే తొలి సంతకం దానిపైనే: కిషన్‌రెడ్డి
eenadu telugu news
Published : 17/09/2021 13:49 IST

Kishan Reddy: భాజపా అధికారంలోకి వస్తే తొలి సంతకం దానిపైనే: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ భాజపా నేతలు విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వచ్చిన వెంటనే సెప్టెంబర్‌ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు తొలి సంతకం చేస్తామన్నారు. 

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ముషీరాబాద్‌లోని భాజపా కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మాట్లాడుతూ మజ్లిస్‌ మెప్పుకోసమే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని విమర్శించారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని