ఓయూలో కృత్రిమ మేధ కోర్సుకు డిమాండ్‌
eenadu telugu news
Published : 19/09/2021 02:08 IST

ఓయూలో కృత్రిమ మేధ కోర్సుకు డిమాండ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్‌ కళాశాలలో 2021-22 సంవత్సరం నుంచి బీఈ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌-మెషిన్‌ లెర్నింగ్‌) కోర్సు అందుబాటులోకి వచ్చింది. మొత్తం 60 సీట్లతో కోర్సును ప్రవేశపెట్టారు. ఎంసెట్‌ మొదటి విడత కౌన్సిలింగ్‌లోనే మొత్తం సీట్లన్నీ నిండిపోయాయి. ఈ ఏడాది నుంచే ప్రవేశపెట్టిన మైనింగ్‌ ఇంజినీరింగ్‌లోనూ 60 సీట్లకుగాను 59 నిండాయి. కొత్త కోర్సుల్లో సీట్లన్నీ భర్తీ అయినప్పటికీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష, ఐఐటీల్లో ప్రవేశాలకు కౌన్సిలింగ్‌ పూర్తి కాకుండా ఎంసెట్‌లో సీట్లు నింపడంపై ఆచార్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకులు వస్తే ఆయా కోర్సుల్లో చేరిన విద్యార్థులు ఐఐటీలకు వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనివల్ల సీట్లు మిగిలి వృథా అవుతాయని వివరిస్తున్నారు. ఎంసెట్‌ చివరి విడత కౌన్సిలింగ్‌ను జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల తర్వాత నిర్వహించాలని సూచిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని