మానవతావాది ఎంపీ రంజిత్‌రెడ్డి: మంత్రి కేటీఆర్‌
eenadu telugu news
Published : 19/09/2021 02:08 IST

మానవతావాది ఎంపీ రంజిత్‌రెడ్డి: మంత్రి కేటీఆర్‌


త్రిచక్ర వాహనాన్ని దివ్యాంగురాలికి పంపిణీ చేసి నమస్కరిస్తున్న మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి గొప్ప మానవతావాది అని మంత్రి కేటీఆర్‌ ప్రశంసించారు. తన జన్మదినం సందర్భంగా కేటీఆర్‌ పిలుపు మేరకు ఎంపీ రంజిత్‌రెడ్డి దివ్యాంగులకు 105 త్రిచక్ర వాహనాలను విరాళంగా ఇచ్చారు. రంజిత్‌రెడ్డి జన్మదినమైన శనివారం వాటిని కేటీఆర్‌ హైదరాబాద్‌ బేగంపేటలో పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ.. రంజిత్‌రెడ్డి రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్‌లో ప్రశ్నిస్తున్నారని కొనియాడారు. చేవెళ్లలోని ప్రభుత్వ ఆసుపత్రులకు ఏడు అంబులెన్సులు ఇచ్చారని, విద్యార్థుల ఆన్‌లైన్‌ తరగతుల కోసం తన పార్లమెంట్‌ పరిధిలోని ప్రతి గ్రామానికి డిజిటల్‌ టీవీలు అందించారన్నారు. అనంతరం రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ స్ఫూర్తితోనే తాను ప్రజలకు సేవలందిస్తున్నట్లు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని