మైహోం జ్యూవెల్‌కు పురస్కారాలు
eenadu telugu news
Published : 19/09/2021 02:08 IST

మైహోం జ్యూవెల్‌కు పురస్కారాలు


శ్రీనివాస్‌గుప్తా, జూపల్లి వినోద్‌ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న మైహోం జ్యువెల్‌ సంఘం ప్రతినిధులు

మియాపూర్‌, న్యూస్‌టుడే: మదీనగూడలోని మైహోం జ్యూవెల్‌ గేటెడ్‌ కమ్యూనిటీ గణేష్‌ ఉత్సవాల్లో భాగంగా రెండు అవార్డులను సొంతం చేసుకుంది. తెలంగాణ టూరిజం అండ్‌ కార్పొరేషన్‌, లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ యువ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా మైహోం జ్యూవెల్‌కు ఈ అవార్డులు సొంతమయ్యాయి. నగర వ్యాప్తంగా 28 అతి పెద్ద గేటెడ్‌ కమ్యూనిటీలు ఈ అవార్డుల పోటీల్లో నిలవగా ఉత్సవాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణతోపాటు పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని మైహోం జ్యూవెల్‌కు విన్నర్‌ ఆప్‌ గ్రాండ్‌ గణేష అవార్డు 2021, తెలంగాణ టూరిజం రత్న 2021 అవార్డుకు ఎంపిక చేశారు. ఈ మేరకు మదీనగూడ జ్యూవెల్‌ ప్రాంగణంలో నిర్వహించిన ప్రత్యేక వేడుకల్లో తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ శ్రీనివాస్‌ గుప్తా, మైహోం కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ డైరెక్టర్‌ జూపల్ల్లి వినోద్‌, లయన్స్‌ క్లబ్‌ యువ అధ్యక్షుడు సౌరబ్‌ సురేఖ ముఖ్య అతిథులుగా హాజరై సంక్షేమ సంఘం ప్రతినిధులకు ఈ అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జ్యూవెల్‌ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శులు పి.మురళీధర్‌రావు, కె.నందకిషొర్‌, ప్రతినిధులు అర్జున్‌రావు, ఎన్‌సీ గుప్తా పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని