చిత్ర వార్తలు
eenadu telugu news
Published : 19/09/2021 02:08 IST

చిత్ర వార్తలు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో శనివారం గణపతిహోమం నిర్వహించారు. ఆయన సతీమణి శోభ, మంత్రి కేటీఆర్‌-శైలిమ దంపతులు, వారి కుమారుడు హిమాన్ష్‌, కుమార్తె అలేఖ్య, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ పాల్గొన్నారు.


శ్రద్దగా సందడి

సినీనటి శ్రద్ధాదాస్‌ శనివారం సాయంత్రం కొండాపూర్‌లో సందడి చేసింది. స్టార్‌ బజ్‌ కంపెనీకి సంబంధించిన మొబైల్‌ అపిక్లేషన్‌ను ఆమె చేతుల మీదుగా ఆవిష్కరించారు. కొండాపూర్‌లోని ఓ రెస్టారెంట్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్టార్‌ బజ్‌ కంపెనీ వ్యవస్థాపకులు కృష్ణప్రియ, సహవ్యవస్థాపకులు అరవిందా బొల్లినేని పాల్గొన్నారు.

- న్యూస్‌టుడే, మాదాపూర్‌


తరాల వారధులు

 

భక్త రామదాసుగా ప్రఖ్యాతి గాంచిన కంచర్ల గోపన్న 11వ తరం వారసుడు కంచర్ల వెంకటరమణ.. హైదరాబాద్‌ రాజ్యాన్ని ఏలిన నిజాం నవాబు మునిమనవడు రోనక్‌యార్‌ఖాన్‌లు నగరంలో ఓ కార్యక్రమంలో కలిశారు. తరాలు మారినా చెదరని చారిత్రక వైభవాన్ని గుర్తు చేసుకున్నారు.


గణేశ్‌ నిమజ్జనోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు వచ్చిన ఝార్ఖండ్‌కు చెందిన ప్రదీప్‌భయ్యాజీ మహరాజ్‌ను శనివారం భాగ్యనగర్‌ ఉత్సవ సమితి సభ్యులు సన్మానించారు. మరోవైపు డీజీపీ మహేందర్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిలు ఖైరతాబాద్‌ గణనాథుడిని దర్శించుకున్నారు.


ఏపీలోని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసంపై దాడికి యత్నించిన నేపథ్యంలో తెతెదేపా ఆధ్వర్యంలో శనివారం బంజారాహిల్స్‌లో మౌన ప్రదర్శన, ర్యాలీ నిర్వహించారు. పార్టీ తెలంగాణ అధ్యక్షులు బక్కని నర్సింహులు, జ్యోత్స్న, ప్రసూన పాల్గొన్నారు.

- న్యూస్‌టుడే, జూబ్లీహిల్స్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని