మాతృభాషల పరిరక్షణకు నడుం బిగించాలి
eenadu telugu news
Published : 19/09/2021 02:08 IST

మాతృభాషల పరిరక్షణకు నడుం బిగించాలి

తాపీ ధర్మారావు పురస్కారాన్ని ముకుంద రామారావుకు అందజేస్తున్న ఆచార్య జయధీర్‌ తిరుమల రావు,

చిత్రంలో ఆచార్య బి.రవీందర్‌ యాదవ్‌, డా. సామల రమేష్‌ బాబు, జస్టిస్‌ ఎ.రామలింగేశ్వరరావు తదితరులు

బంజారాహిల్స్‌, న్యూస్‌టుడే: మాతృభాషల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాల్సిన అవసరం ఉందని ఆచార్య జయధీర్‌ తిరుమలరావు పిలుపు ఇచ్చారు. ప్రస్తుత ప్రభుత్వాల భేషజాల వల్ల ‘మాతృ భాషల’కు పెనుముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ కామర్స్‌ కళాశాలలో శనివారం తాపీ ధర్మారావు పురస్కార ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. అవార్డును ప్రముఖ పరిశోధక కవి, అనువాదకులు వై.ముకుంద రామారావుకు ఇవ్వడం సముచితమని తిరుమలరావు అన్నారు. విశిష్ట అతిథి జస్టిస్‌ ఎ.రామలింగేశ్వరరావు మాట్లాడుతూ.. తాపీ ధర్మారావును మించి ఆయన రచనలు ప్రాచుర్యం పొందాయన్నారు. ముఖ్యఅతిథులుగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బి.రవీందర్‌ యాదవ్‌, ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు, కళాశాల మాజీ ప్రిన్సిపల్‌ పూర్ణచంద్రరావు, కన్నెగంటి అనసూయ, డా. ఏకే ప్రభాకర్‌, నిర్వాహక కర్త, అమ్మనుడి భాషోద్యమ మాసపత్రిక ముఖ్య సంపాదకులు డా. సామల రమేష్‌బాబు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని