సంగీత, నృత్యకళల్లో దైవత్వం ఉంటుంది
eenadu telugu news
Published : 19/09/2021 02:08 IST

సంగీత, నృత్యకళల్లో దైవత్వం ఉంటుంది


నాట్యగురువు సుధీర్‌రావును సత్కరిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

రవీంద్రభారతి, న్యూస్‌టుడే: ‘భారతీయ సంగీత, నృత్య కళల్లో దైవత్వం’ ఉంటుందని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డా.వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. గురు శివానంద నృత్యమాల (వరంగల్‌) ఆధ్వర్యంలో శనివారం రాత్రి రవీంద్రభారతిలో ‘విశ్వనాథామృతం’ పేరిట నాట్యగురువు బి.సుధీర్‌రావు శిష్యబృందం నృత్య ప్రదర్శన కనువిందు చేసింది. రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు నృత్యోత్సవాన్ని ప్రారంభించగా, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. ఈతరం సినిమాలు చూస్తే మనం ఎటువైపు వెళుతున్నామో తెలియని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. సంప్రదాయ సంగీత, నాట్య కళలను పిల్లలకు నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య తంగెడ కిషన్‌రావు మాట్లాడుతూ.. వర్సిటీలో ప్రస్తుతం కూచిపూడి, ఇతర నృత్యాంశాల్లో ఎంఏ కోర్సులు ఉన్నాయన్నారు. త్వరలోనే పేరిణిలో ఎంఏ, నృత్యం కోర్సులలో డిగ్రీ స్థాయి ప్రవేశపెట్టే ఆలోచన ఉందన్నారు. కార్యక్రమంలో సప్తపది చిత్ర కథానాయిక, నాట్యగురువు సబిత తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని