పరిశ్రమ సంపులో పడి చిన్నారి మృతి
eenadu telugu news
Published : 19/09/2021 02:16 IST

పరిశ్రమ సంపులో పడి చిన్నారి మృతి

చిన్నారి మృతదేహం వద్ద సొమ్మసిల్లి పడిపోయిన తల్లి

కొత్తూరు, న్యూస్‌టుడే: అనుమానాస్పద స్థితిలో మూడేళ్ల చిన్నారి సంపులో పడి మృతిచెందిన సంఘటన శనివారం కొత్తూరు పురపాలక పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన భూపేంద్ర కుమార్‌, విషేదిత అలియాస్‌ రింకీ కొత్తూరు తండా వద్ద శ్రీసాయిరాఘవ పాలిమర్స్‌లో కార్మికులుగా పనిచేస్తూ అక్కడి క్వార్టర్లలోనే ఉంటున్నారు. వీరికి రామ్‌(3) సంతానం. శనివారం పరిశ్రమకు సెలవు ప్రకటించారు. దీంతో తండ్రి రామ్‌ను తీసుకుని.. ఉదయం తోటి కార్మికుడితో మాట్లాడేందుకు ప్లాస్టిక్‌ కవర్లను శుద్ధిచేసే షెడ్డులోకి వెళ్లాడు. అనంతరం కుమారుడి విషయాన్ని మర్చిపోయి వెళ్లిపోయాడు. కొద్దిసేపటికి రామ్‌ ఆచూకీ కనిపించకపోవడంతో అంతటా వెతికాడు. అనుమానంతో సంపులో గాలించగా మృతదేహం లభించింది. ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లి రోదిస్తూనే సొమ్మసిల్లింది. కాగా ఘటనపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని