Crime News: ‘నాన్నను అమ్మే మెడకు చున్నీ చుట్టి చంపేసింది’!
eenadu telugu news
Updated : 19/09/2021 05:25 IST

Crime News: ‘నాన్నను అమ్మే మెడకు చున్నీ చుట్టి చంపేసింది’!

భర్త మృతి.. భార్యపై అనుమానాలు

రెండు నెలల తరువాత కేసు


జగదీష్‌తో భార్య సుస్రిత

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: భర్త గుండెపోటుతో మృతి చెందాడని ఆయన కుటుంబ సభ్యులకు భార్య సమాచారం ఇచ్చింది. మృతదేహాన్ని 11 ఏళ్ల కుమారుడితో కలిసి కాకినాడకు తీసుకువెళ్లగా అంత్యక్రియలు పూర్తి చేశారు. రెండు నెలల తరువాత భార్యే హత్య చేసిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే.. కాకినాడలోని మధురానగర్‌కు చెందిన జగదీష్‌(43)కు 2007లో సుస్రితతో వివాహమైంది. వారికి ఆరో తరగతి చదువుతున్న కుమారుడు రోహిత్‌ ఉన్నాడు. జగదీష్‌ డ్రైవరుగా పనిచేస్తుండగా సుస్రిత సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఉద్యోగి. ఫిలింనగర్‌లో ఉంటున్నారు. జులై 15న భర్త గుండెపోటుతో మృతిచెందాడని ఆయన సోదరుడు రాజేష్‌కు భార్య సమాచారం ఇచ్చారు. దీంతో మృతదేహాన్ని కాకినాడకు తీసుకువెళ్లారు. మరుసటి రోజు (16న) అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ నెల 9న బాబాయి రాజేష్‌ ఇంటికి వెళ్లిన రోహిత్‌ ‘నాన్నను అమ్మే మెడకు చున్నీ చుట్టి చంపిందంటూ’ చెప్పడంతో అనుమానం వచ్చిన ఆయన సోదరుడు సమన్‌సాయి ప్రసాద్‌తో కలిసి 14న బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా సుస్రితను పోలీసులు విచారించారు. గుండెపోటు వస్తే ఆసుపత్రికి ఎందుకు తీసుకువెళ్లలేదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడకు వెళ్లి మరోసారి శవ పంచనామా చేయించాలని భావిస్తున్నట్లు ఎస్సై రవిరాజ్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని