HYD: ట్యాంక్‌ బండ్ పరిసర ప్రాంతాల్లో వర్షం.. కొనసాగుతున్న శోభాయాత్ర
eenadu telugu news
Updated : 19/09/2021 17:25 IST

HYD: ట్యాంక్‌ బండ్ పరిసర ప్రాంతాల్లో వర్షం.. కొనసాగుతున్న శోభాయాత్ర

హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. చార్మినార్, శాలిబండ, ఫలక్ నుమా, లాల్ దర్వాజ, చాంద్రాయణగుట్ట, యాఖత్ పురా, బహదూర్ పురా, అఫ్జల్‌గంజ్‌, మొజంజాహీ మార్కెట్‌ పాటు ట్యాంక్‌ బండ్‌ పరిసర ప్రాంతాల్లో మోస్తరు జల్లులు కురిశాయి. చిరుజల్లుల మధ్య గణేశ్‌ శోభయాత్ర కొనసాగుతోంది. ఇవాళ భాగ్యనగరంలో పెద్ద ఎత్తున గణేశుడి నిమజ్జనం జరుగుతున్న నేపథ్యంలో వర్షంలోనే గణనాథులు ఊరేగింపు సాగుతోంది. మరోవైపు కాసేపట్లో మహాగణపతి ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటోందని మంత్రి తలసాని తెలిపారు. నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఆయన హుస్సేన్‌సాగర్‌లో బోటులో తిరిగారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని