నిమజ్జన వ్యర్థాల తొలగింపులో నిమగ్నమైన జీహెచ్‌ఎంసీ సిబ్బంది
eenadu telugu news
Published : 20/09/2021 21:05 IST

నిమజ్జన వ్యర్థాల తొలగింపులో నిమగ్నమైన జీహెచ్‌ఎంసీ సిబ్బంది

హైదరాబాద్‌: హైదరాబాద్ హుస్సేన్‌సార్‌ ట్యాంక్‌బండ్‌పై వినాయక నిమజ్జనాలు విజయవంతంగా ముగియడంతో వ్యర్థాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. సాగర తీరంలో ఉన్న వ్యార్థాలను క్రేన్ల సాయంతో తొలగిస్తూ ఎప్పటికప్పుడు ప్రత్యేక వాహనాల్లో తరలిస్తున్నారు. ఎండిపోయిన పూలు, సామగ్రి, ఇతర చెత్తను తొలగించే ప్రక్రియలో జీహెచ్‌ఎంసీ యంత్రాంగం నిమగ్నమైంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో మొత్తంగా వెయ్యి మందికిపైగా జీహెచ్‌ఎంసీ వివిధ విభాగాల సిబ్బంది, ఒప్పంద, పొరుగు సేవల కార్మికులు, రోజువారీ కూలీలు వ్యర్థాల తొలగింపు ప్రక్రియలో నిమగ్నమయ్యారు. రోడ్లపై స్వీపింగ్‌ యంత్రాల సాయంతో పారిశుద్ధ్య పనులను ఏకకాలంలో చేస్తున్నారు. ట్యాంక్ బండ్, చెరువులు, నీటి కొలనుల్లో నిమజ్జనం చేసిన మొత్తం 83,186 గణేష్ ప్రతిమలు తొలగించారు. దుర్గంధం వెదజల్లకుండా ఉండేందుకు రసాయనాలు పిచికారీ చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని