గంజాయి కేసులో నిందితుడి రిమాండ్‌
eenadu telugu news
Published : 21/09/2021 00:57 IST

గంజాయి కేసులో నిందితుడి రిమాండ్‌

ఆబ్కారీ పోలీసుల అదుపులో వెంకన్న

జహీరాబాద్‌ అర్బన్‌: పత్తి పొలంలో అంతర పంటగా రూ.5.20 కోట్ల విలువైన గంజాయి సాగు చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఆబ్కారీ వలయాధికారి అశోక్‌కుమార్‌ పేర్కొన్నారు. ఝరాసంగం మండలం ఏడాకులపల్లి గ్రామానికి చెందిన మంగలి వెంకన్న రెండు ఎకరాల పత్తి పొలంలో ఈ నెల 17న దాడులు చేసి 4 వేలకు పైగా మొక్కలను ధ్వంసం చేసి కాల్చివేసినట్లు తెలిపారు. పోలీసుల రాకతో పరారైన నిందితుడిని సోమవారం జహీరాబాద్‌లో పట్టుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని