రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలు ప్రారంభం
eenadu telugu news
Published : 21/09/2021 00:57 IST

రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలు ప్రారంభం

వరంగల్‌ క్రీడావిభాగం, న్యూస్‌టుడే: 37వ సబ్‌ జూనియర్‌ రాష్ట్ర హ్యాండ్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు హనుమకొండలో సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జేఎన్‌.ఇండోర్‌ స్టేడియంలో మూడు రోజుల పాటు జరిగే పోటీలకు రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాలకు చెందిన బాలబాలికలు హాజరయ్యారు. తొలిరోజు క్వాలిఫైయింగ్‌ రౌండ్స్‌లో నిజామాబాద్‌, మెదక్‌, నల్లగొండ, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల బాలబాలికలు ఉత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలోకి దిగారు. ప్రారంభ వేడుకలకు ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా క్రీడ ప్రాధికారత సంస్థ అధికారి గుగులోతు అశోక్‌కుమార్‌, రాష్ట్ర హ్యాండ్‌బాల్‌ సంఘం కార్యదర్శి శ్యామల పవన్‌కుమార్‌, భారత జూడో సమాఖ్య కోశాధికారి కైలాస్‌యాదవ్‌, సాట్స్‌ పరిశీలకులు రవికుమార్‌, డీఎస్‌ఏ కోచ్‌ విష్ణువర్ధన్‌, టెక్నికల్‌ కమిటీ కన్వీనర్‌ ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని