మురంశెట్టి రాములు ప్రమాణ స్వీకారం
eenadu telugu news
Published : 21/09/2021 00:57 IST

మురంశెట్టి రాములు ప్రమాణ స్వీకారం

స్వామి వారి ప్రసాదం అందజేస్తున్న తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి

తితిదే పాలకమండలి సభ్యుడిగా సిద్దిపేటకు చెందిన మురంశెట్టి రాములు సోమవారం తిరుమలలోని శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి ఆధ్వర్యంలో సదరు ప్రక్రియ కొనసాగింది. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు స్వామి వారి ఆశీర్వచనాలు అందజేశారు. స్వామి వారి చిత్రపటం, ప్రసాదాన్ని అదనపు ఈవో అందజేశారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడారు. స్వామి ఆశీస్సులతో భక్తులకు సేవ చేసే భ్యాగం మరోసారి కలిగిందన్నారు. నమ్మకంతో అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటానన్నారు. మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబ సమేతంగా కార్యక్రమంలో పాల్గొన్నారు.

- న్యూస్‌టుడే, సిద్దిపేట టౌన్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని