పిడుగు భయం..ఉలిక్కిపడ్డ పోలీసులు
eenadu telugu news
Published : 21/09/2021 00:57 IST

పిడుగు భయం..ఉలిక్కిపడ్డ పోలీసులు

బొంరాస్‌పేట, న్యూస్‌టుడే: ఉరుములు, మెరుపులతో వర్షం.. ఠాణాలో ఒక్కసారిగా విద్యుదాఘాతం.. వైర్‌లెస్‌ సెట్‌ పెద్ద శబ్దంతో కాలిపోయింది. దీంతో కొడంగల్‌ ఠాణాలో పోలీసులు ఉలిక్కిపడ్డారు. స్టేషన్‌పై పిడుగు పడిందని అనుకున్నారు. సోమవారం సాయంత్రం స్టేషన్‌లో సిబ్బందితో పాటు వివిధ పనులతో అక్కడికొచ్చిన 30 మంది సైతం  భయాందోళనకు గురయ్యారు. వైర్‌లెస్‌ సెట్‌ కాలిపోగా.. ఠాణాపై పిడుగు పడినట్లు ఆనవాళ్లు మాత్రం కనిపించ లేదని కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌గౌడ్‌ వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని