గిరిజనం.. ఉపాధికి ఊతం
eenadu telugu news
Published : 21/09/2021 00:57 IST

గిరిజనం.. ఉపాధికి ఊతం

గతంలో దరఖాస్తు చేసుకున్న వారికే అవకాశం

న్యూస్‌టుడే,వికారాబాద్‌టౌన్‌: గిరిజనులకు వివిధ సంక్షేమ పథకాలున్నా వారి పరిస్థితి ఇప్పటికీ దయనీయమే. కూలీ పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. గ్రామాలకు దూరంగా తండాల్లో జీవనం సాగిస్తున్న వారే ఎక్కువ. రిజర్వేషన్లు ఉన్నా పోటీ పెరగటంతో కొంతమందే అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం గిరిజనులకు స్వయం ఉపాధికి రాయితీ మొత్తాన్ని పెంచి 2021-22 కార్యాచరణ ప్రణాళిక కింద లక్ష్యాలను నిర్దేశించింది. జిల్లాలో గిరిజన జనాభా 94,623. బొంరాస్‌పేట మండలంలో 15,015, కుల్కచర్ల 15,976, పెద్దేముల్‌ 8,895, నవాబుపేట 187 మంది ఉన్నారు. ట్రైకార్‌ ద్వారా గిరిజన యువతకు స్వయం ఉపాధి పథకాలను అమలు చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం జిల్లాకు రూ.1.78 కోట్లు రాయితీ కింద కేటాయించారు. రెండేళ్లకు కలిపి మొత్తం రూ.8.76 కోట్లు అందించనున్నారు. గత ఆర్థిక సంవత్సరం 213 యూనిట్ల లక్ష్యం కాగా రెండు సంవత్సరాలకు కలిపి 1,055 కలిపి గ్రౌండింగ్‌ చేయనున్నారు. ఆయా యూనిట్ల కోసం ఇప్పటికే 842 మంది దరఖాస్తు చేసుకున్నారు.  
కొత్తగా అవకాశం లేదు: 202-21 సంవత్సరానికి సంబంధించి రాయితీ రుణాలకు దరఖాస్తు చేసిన వారికే ఈ ఆర్థిక సంవత్సరం మంజూరైన రాయితీ నిధులను అందజేస్తారు. కొన్నింటికే అందిన దరఖాస్తుదారుల్లో భారీగా జనాభా ఆధారంగా లక్ష్యాలను నిర్దేశించే పనిలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. మండల స్థాయి అధికారులు తమ పరిధిలో లక్ష్యాలకు అనుగుణంగా లబ్ధిదారులను ఎంపికచేసి గిరిజన సంక్షేమ శాఖ జిల్లా కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది.

లక్ష్యం ఇలా..

షెడ్యూల్డు తెగలకు చెందిన యువతకు స్వయం ఉపాధి రంగంలో నిలదొక్కుకునేలా అవకాశం కల్పించడం.

ఆదాయ వనరును పెంపొందించడం ద్వారా నిరుద్యోగిత రేటును తగ్గించడం

క్షేత్రస్థాయి నుంచి అభివృద్ధికి బాటలు వేయడం.

నూతన ఆలోచనలతో యూనిట్లు నెలకొల్పేందుకు ముందుకు వచ్చే గిరిజన యువతను ప్రోత్సహించడం.

లబ్ధిదారులను ఎంపిక చేస్తాం
కోటాజీ, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి

తాజాగా రాయితీ నిధులు కేటాయించిన నేపథ్యంలో అర్హులనే ఎంపిక చేస్తాం. లక్ష్యాలకు అనుగుణంగా మండలాల అధికారులకు కేటాయింపులు చేస్తున్నాం. ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని