బయో డీజిల్‌ పేరిట దందా
eenadu telugu news
Published : 21/09/2021 00:57 IST

బయో డీజిల్‌ పేరిట దందా

గౌతాపూర్‌లో పంపు ఏర్పాటుపై ఫిర్యాదు

తాండూరుగ్రామీణ, న్యూస్‌టుడే: బయోడీజిల్‌ పేరిట అక్రమ దందా నిర్వహించడంపై వాహనదారులు ఫిర్యాదు చేసిన ఘటన సోమవారం జరిగింది. తాండూరు మండలం గౌతాపూర్‌ శివారులో పట్టణానికి చెందిన ఓ వ్యాపారి రెవెన్యూ, పెట్రోలియం శాఖ, రహదారులు భవనాల శాఖ, గ్రామ పంచాయతీల నుంచి అనుమతులు పొందకుండా ఏకంగా బయోడీజిల్‌బంకు ఏర్పాటు చేసి విక్రయాలు ప్రారంభించారు. నాణ్యతపై ఏమాత్రం అవగాహన లేకున్నా ప్రయోగాత్మకం పేరిట నిర్వహిస్తున్నట్లు వ్యాపారి వెల్లడించారు. అక్రమంగా ఏర్పాటైన బంకు ద్వారా విక్రయిస్తున్న బయోడీజిల్‌ను వినియోగిస్తే వాహనాలు దెబ్బతింటే ఎవరు బాధ్యులంటూ వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. ఈక్రమంలో రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దారు చిన్నప్పలనాయుడుకు ఫిర్యాదు చేశారు. వెంటనే నిర్వహకులను కార్యాలయానికి రప్పించిన తహసీల్దారు అనుమతులపై ఆరా తీశారు. అనుమతులు లేవని తేలడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. అనుమతుల్లేకుండా డీజిల్‌ బంకు నెలకొల్పడంపై విచారణ పూర్తిచేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తహసీల్దారు వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని