దక్షిణాన దంచింది!
eenadu telugu news
Published : 21/09/2021 02:13 IST

దక్షిణాన దంచింది!

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: జోరువాన బీభత్సానికి మహానగరం మరోసారి వణికింది. దాదాపు అన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం నుంచీ చిరుజల్లులు కురవగా.. దక్షిణాన పాతబస్తీలో కుంభవృష్టి బీభత్సం సృష్టించింది. గంటన్నర వ్యవధిలోనే చందూలాల్‌ బారాదరిలో 9.1 సెంటీమీటర్ల భారీ వాన కురిసింది. ఆదివారం మధ్యాహ్నం నుంచే అక్కడక్కడా వానలు కురుస్తుండగా.. సోమవారం ఉదయం నుంచీ నగరం మేఘావృతమై ఉంది. మధ్యాహ్నం 12తర్వాత మొదలై సాయంత్రం దాకా ఆగకుండా కురవడంతో పాతబస్తీలో శాలిబండ, చార్మినార్‌, కాలాపత్తర్‌, నయీంనగర్‌ ప్రాంతాల్లోనూ నాలాలు, డ్రైన్లు పొంగిపొర్లాయి. జీహెచ్‌ఎంసీ, విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. మధ్యాహ్నం భారీవర్ష సూచనతో వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారంతో పాటు రాబోయే మరో రెండు, మూడు రోజులు హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల పరిధిలో వర్షాలు పడే అవకాశముందని తెలిపింది.
అత్తాపూర్‌ పిల్లర్‌ నంబర్‌ 185 నుంచి 190 దాకా వాహనాలు మునిగిపోయేంత వరద నీరు రోడ్లపైకి చేరింది.  
కీసర, రాంపల్లి, పెద్ద అంబర్‌పేట, మల్లాపూర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ ప్రాంతాల్లోనూ ఉరుములతో కూడిన వాన బీభత్సం సృష్టించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని