జల మండలి ఉద్యోగులకు ఆరోగ్య భద్రత
eenadu telugu news
Published : 21/09/2021 02:13 IST

జల మండలి ఉద్యోగులకు ఆరోగ్య భద్రత


ఈనాడు, హైదరాబాద్‌: జల మండలి ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబాలకు ఆరోగ్య భరోసా లభించింది. ప్రగతి భవన్‌లో సోమవారం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా జలమండలి ఉద్యోగులకు హెల్త్‌ కార్డులను అందించారు. కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మున్సిపల్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, జల మండలి ఎండీ దానకిశోర్‌, సీజీఎంలు విజయరావు, ఖాదర్‌, వాటర్‌ వర్స్క్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్షుడు రాంబాబు యాదవ్‌, ఇతర సభ్యులు పాల్గొన్నారు. బోర్డుకు సంబంధించి మొత్తం 3,609 మంది ఉద్యోగులు, 894 మంది పెన్షనర్లు, వారి కుటుంబాలు.. మొత్తం 10 వేలమందికి ఈ ఆరోగ్య బీమా వర్తించనుంది. దేశ వ్యాప్తంగా ఉన్న వెయ్యి  ప్రముఖ ఆసుపత్రుల్లో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు రూ.3 లక్షల వరకు ఉచితంగా ఆరోగ్య సేవలు పొందే వీలు కల్పించారు. దీనికి సంబంధించి ప్రీమియం మొత్తం రూ.6.78 కోట్లను జల మండలే భరించనుంది. ప్రస్తుతం జల మండలిలో పర్మినెంటు ఉద్యోగులు, పింఛనుదారులు, 548 ఫ్యామిలీ పింఛనుదారులకు హెల్త్‌ కార్డులు మంజూరు చేసినట్లు ఎండీ దానకిషోర్‌ తెలిపారు.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని