36.8 కి.మీ దూరం.. 26 నిమిషాలు
eenadu telugu news
Published : 21/09/2021 02:11 IST

36.8 కి.మీ దూరం.. 26 నిమిషాలు

ఎనిమిది నెలల్లో 16 సార్లు గ్రీన్‌ ఛానల్‌

విమానాశ్రయం నుంచి వెళ్తున్న అంబులెన్స్‌

శంషాబాద్‌, న్యూస్‌టుడే: ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ రోగికి అవయవ మార్పిడి కోసం శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి బేగంపేట కిమ్స్‌ ఆసుపత్రి వరకు పోలీసులు సోమవారం మధ్యాహ్నం గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేశారు. పుణెలోని సయాద్రి ఆసుపత్రి నుంచి ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమానంలో ఊపిరితిత్తులను వైద్య బృందం శంషాబాద్‌ విమానాశ్రయానికి తీసుకొచ్చారు. ఇక్కడి నుంచి 36.8 కి.మీ దూరంలో ఉన్న కిమ్స్‌ ఆసుపత్రి వరకు ట్రాఫిక్‌ పోలీసులు గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేయడంతో ప్రత్యేక అంబులెన్స్‌ ద్వారా 26 నిమిషాల్లో గమ్యస్థానానికి చేర్చారు. విమానాశ్రయం నుంచి ఎనిమిది నెలల్లో 16 సార్లు గ్రీన్‌ ఛానల్‌ ద్వారా అవయవాలను తరలించామని ఆర్జీఐఏ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ రామకృష్ణ పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని