లిఫ్ట్‌లో చిక్కుకున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
eenadu telugu news
Updated : 21/09/2021 05:03 IST

లిఫ్ట్‌లో చిక్కుకున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

మియాపూర్‌, న్యూస్‌టుడే: మియాపూర్‌లో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి లిఫ్ట్‌లో చిక్కుకున్నారు. ఆల్విన్‌కాలనీలో ఓ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ కార్యాలయ ప్రారంభానికి వచ్చిన మంత్రితోపాటు ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్లు శ్రీకాంత్‌, జగదీశ్వర్‌గౌడ్‌ 4వ అంతస్తుకు  వెళ్లేందుకు గ్రౌండ్‌ప్లోర్‌లో లిఫ్ట్‌ ఎక్కారు. సాంకేతిక లోపంతో పైకి వెళ్లలేదు.. లిఫ్ట్‌ తలుపూ తెరుచుకోలేదు. మియాపూర్‌ సీఐ వెంకటేష్‌, ఎస్సై వీరబ్రహ్మం, మంత్రి భద్రత సిబ్బంది బలవంతంగా  తలుపు తెరవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని