‘టీఎంయూ మాదే’
eenadu telugu news
Published : 21/09/2021 02:11 IST

‘టీఎంయూ మాదే’

కార్మికశాఖ చట్టవిరుద్ధ చర్యలపై హైకోర్టును ఆశ్రయిస్తాం

మాట్లాడుతున్న తిరుపతి

బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: కార్మికశాఖ ఉన్నతాధికారులు తమ యూనియన్‌ విషయంలో చట్టవిరుద్ధమైన చర్యలు చేపడుతున్నారని, ఆ శాఖపై హైకోర్టును ఆశ్రయించనున్నట్లు టీఎస్‌ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచంద్రారెడ్డిలు తెలిపారు.  సోమవారం నగరంలోని టీఎంయూ రాష్ట్ర కార్యాలయంలో వారు మాట్లాడారు. టీఎంయూలో పదవికి రాజీనామా చేసి వెళ్లిన థామస్‌రెడ్డి తిరిగి తమ యూనియన్‌ను తెరాస అండతో తనదేనని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. దీనికి కార్మికశాఖ అధికారులు, తెరాస ప్రభుత్వం వత్తాసు పలకడం దుర్మార్గమన్నారు. 2021 జూన్‌ 15న యూనియన్‌ను రిజిస్ట్రేషన్‌ చేసుకున్నామని, ఆయనకు తమ యూనియన్‌లో ఎలాంటి హక్కు లేదన్నారు. యూనియన్‌లో కొత్త నాయకత్వాన్ని ఎన్నుకున్నట్లు చెప్పారు. జీఆర్‌ చందర్‌, శంకర్‌,  రాజలింగం, పీఆర్‌ రెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని