‘మాకు జరిగిన అన్యాయం మరొకరికి జరగొద్దు’
eenadu telugu news
Published : 21/09/2021 02:11 IST

‘మాకు జరిగిన అన్యాయం మరొకరికి జరగొద్దు’

నాగార్జునసాగర్‌, న్యూస్‌టుడే: మాకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సింగరేణి కాలనీ పరిధిలో చోటుచేసుకున్న చిన్నారి హత్యాచార బాధిత కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల అత్యాచారం, హత్యకు గురైన చిన్నారి ఆత్మ శాంతి కోసం తల్లిదండ్రులు న నాగార్జునసాగర్‌లో కృష్ణానదీ తీరాన శాంతిపూజ నిర్వహించారు. చిన్నారి తండ్రి మాట్లాడుతూ సైకో మాదిరిగా తిరుగుతున్న వ్యక్తుల విషయంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు.కఠినమైన చట్టాలను రూపొందించి అమలుచేయాలన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని