వరద కాలువలో కొట్టుకొచ్చిన మృతదేహం
eenadu telugu news
Published : 21/09/2021 02:11 IST

వరద కాలువలో కొట్టుకొచ్చిన మృతదేహం

సైదాబాద్‌, న్యూస్‌టుడే: వరద కాలువలో గుర్తుతెలియని మృతదేహం కొట్టుకొచ్చిన ఘటన సైదాబాద్‌ ఠాణా పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఐఎస్‌సదన్‌ డివిజన్‌ కృష్ణానగర్‌-ఆదర్శ్‌నగర్‌ మార్గంలోని వరద కాలువలో సోమవారం సాయంత్రం గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పురుషుడి మృతదేహం(40-45)గా గుర్తించి, పూర్తిగా కుళ్లిపోవడంతో శవపరీక్ష కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం వివరాలు వెల్లడిస్తామని ఇన్‌స్పెక్టర్‌ కె. సుబ్బిరామరెడ్డి తెలిపారు.

గతంలో వ్యక్తి ఎడమ కాలు భాగం..

సరూర్‌నగర్‌ చెరువులోకి వరద నీరు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన ఓపెన్‌ కాలువలోకి ఎగువ ప్రాంతాల నుంచి వరదనీరు తరలివస్తుంది. సోమవారం సాయంత్రం కురిసిన వర్షానికి ఓ శవం కొట్టుకొచ్చిన విషయాన్ని స్థానికులు గుర్తించారు. గతేడాది సెప్టెంబరులోనూ సమీపంలోని రెడ్డికాలనీలో ఉన్న కాలువలోనుంచి వరద తాకిడికి ఓ వ్యక్తి ఎడమ మోకాలు భాగం రహదారిపై ప్రత్యక్షమైంది. ఇప్పుడు మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు సైతం అవాక్కయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని