67 మంది ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక
eenadu telugu news
Published : 21/09/2021 02:11 IST

67 మంది ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక

నాంపల్లి, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 67 మంది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. ఏటా ఉపాధ్యాయ దినోత్సవం ముందుగానే ఈ జాబితా ప్రకటించేవారు. విద్యాశాఖాధికారిణి రోహిణి అనారోగ్యం కారణంగా సెలవులో ఉండటంతో ఆ రోజు ప్రకటించలేదు. 67 మందిని ఎంపిక చేస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌ సమీపంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని డాక్టర్‌ ఎన్డీఆర్‌ ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు డీఈవో పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని