Karvy Stock Broking case: కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ కేసులో మరో వ్యక్తి అరెస్టు
eenadu telugu news
Published : 22/09/2021 02:09 IST

Karvy Stock Broking case: కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ కేసులో మరో వ్యక్తి అరెస్టు

హైదరాబాద్: కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ కేసు వ్యవహారంలో హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకృష్ణను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పెట్టుబడిదారుల షేర్లను 9 డొల్ల కంపెనీలకు శ్రీకృష్ణ మళ్లించినట్లు సీసీఎస్ పోలీసుల దర్యాప్తులో తేలింది. సెబీకి సమాచారం ఇవ్వకుండా షేర్లను బ్యాంకుల్లో తనఖా పెట్టి దాదాపు రూ.1,500 కోట్లను కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ రుణంగా తీసుకుంది. బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను వైస్ ప్రెసిడెంట్ శ్రీకృష్ణ 9 డొల్ల కంపెనీలకు మళ్లించారు. పెట్టుబడిదారులకు నష్టం చేకూర్చే విధంగా శ్రీకృష్ణ వ్యవహరించడంతో పాటు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను నిబంధనలకు విరుద్ధంగా దారి మళ్లించినట్లు సీసీఎస్ పోలీసులు గుర్తించారు. ఈ మేరకు శ్రీకృష్ణను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఈ కేసులో ఇప్పటికే సీసీఎస్ పోలీసులు సంస్థ ఛైర్మన్ పార్థసారథి, సీఈఓ కృష్ణహరి, సీఓఓ రాజీవ్ సింగ్‌తో పాటు కంపెనీ సెక్రటరీ శైలజను అరెస్ట్ చేశారు. కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్‌పై హైదరాబాద్ సీసీఎస్‌లోనే మరో కేసు నమోదైంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి రూ.350 కోట్ల రుణం తీసుకొని తిరిగి చెల్లించలేదు. దీంతో బ్యాంకు ప్రతినిధుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ.550 కోట్లు రుణం తీసుకొని తిరిగి చెల్లించకపోవడంతో గచ్చిబౌలి పీఎస్ లోనూ కేసు నమోదైంది. మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ మోసాలపై దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని