సభ్యుల అంగీకారం మేరకే నిర్ణయాలు
eenadu telugu news
Published : 22/09/2021 00:38 IST

సభ్యుల అంగీకారం మేరకే నిర్ణయాలు

గీత కార్మికులతో మాట్లాడుతున్న అదనపు పర్యవేక్షకులు మల్లారెడ్డి

నవాబ్‌పేట: సహకారం సంఘం విషయమై గీత కార్మికుల అంగీకారం మేరకే నిర్ణయం తీసుకుంటామని జిల్లా ఆబ్కారీ సహాయ పర్యవేక్షకులు (అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌) మల్లారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని చిట్టిగిద్ద గ్రామంలో గీతకార్మికుల సహకార సంఘం (టీసీఎస్‌) ఏర్పాటుకు అభిప్రాయ సేకరణ నిర్వహించారు. గతంలో సొసైటీ ఏర్పాటు చేసి బడా గుత్తేదారులకు అమ్మేశారని తెలిపారు. ఇటీవల ఈ కల్తీ కల్లు తాగినవారు కొందరు ఆసుపత్రి పాలైతే, మేం జైలుకు వెళ్లామన్నారు. సొసైటీ వద్దని, వయస్సు మళ్లిన వారికి కాకుండా గీత వచ్చిన వారికే టీఎఫ్‌టీ (ట్రీ ఫర్‌ ట్యాపర్‌) లైసెన్సులు ఇవ్వాలన్నారు. ఇలాగైతే కల్తీకల్లు సమస్య ఉండదని, గీతకార్మికుడికి ఉపయోగకరంగా ఉంటుందని కొందరు అధికారులను కొరగా, మరికొందరు సొసైటీ ఏర్పాటు చేయడమే అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందని అధికారులకు విన్నవించారు. ఈ విషయంలో వారి మద్య కొంత సేపు రభస  కొనసాగింది. సముదాయించిన అధికారులు అందరి అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో సీఐ జిలానిబేగం, ఎస్సైలు శ్రావన్‌, జాఫర్‌, కార్తిక్‌రెడ్డి, గీతాకార్మికులు తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని