జిల్లాలో వానలు
eenadu telugu news
Published : 22/09/2021 00:38 IST

జిల్లాలో వానలు

అలుగు పారిన చెరువులు

బొంరాస్‌పేట వద్ద..

తాండూరుగ్రామీణ, న్యూస్‌టుడే: తాండూరు మండలంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. నాపరాయి గనుల్లో కార్యకలాపాలు స్తంభించాయి. మల్కాపూర్‌, సంగెంకలాన్‌, చంద్రవంచ, గోనూరు, నారాయణ్‌పూర్‌, గౌతాపూర్‌, అల్లాపూర్‌లో లోతట్టునున్న పొలాల్లో వరద నిలిచి పెసర, మినుము, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. చెంగోల్‌లో వరద పారకానికి అడ్డుగా బాహ్య వలయ రహదారి నిర్మించడంతో ఇరువైపులా వరి పొలాలు నీట మునిగాయి. ఈనెల మొదటి వారంలో కురిసిన భారీ వర్షానికి వందకుపైగా ఎకరాలు తుడిచిపెట్టుకుపోగా తాజాగా మరో యాభైకిపైగా ఎకరాల్లో వరి పంట నష్టపోయినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుత్తేదారు, ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. గౌతాపూర్‌, కరణ్‌కోట, చించోళి రహదారిపై గుంతల్లో వరద నిలిచి రాకపోకలకు వాహనదారులు, ప్రయాణికులు అవస్థలు ఎదుర్కొన్నారు.

బొంరాస్‌పేట: దౌల్తాబాద్‌, కొడంగల్‌ మండలాల్లో మోస్తారుగా వర్షం పడగా బొంరాస్‌పేట మండలంలోని కొన్ని గ్రామాల్లో భారీ వర్షాలతో చెరువుల్లోకి నీళ్లు చేరుతున్నాయి. మెట్లకుంట చెరువు అలుగు పారింది. బొంరాస్‌పేట చెరువు అలుగు నీరు మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన రోడ్డు కల్వర్టుపై నుంచి వెళ్తోంది.


తాండూరు మండలం గౌతాపూర్‌ వద్ద దుస్థితి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని