బయో డీజిల్‌ బంకుకు తాళం
eenadu telugu news
Published : 22/09/2021 00:38 IST

బయో డీజిల్‌ బంకుకు తాళం

బంకును మూసివేయిస్తున్న ఎస్‌ఐ ఏడుకొండలు, గిర్దావర్‌ రాజురెడ్డి

గౌతాపూర్‌(తాండూరుగ్రామీణ), న్యూస్‌టుడే: అక్రమ దందాకు కాదేది అనర్హం అన్నచందంగా మారింది తాండూరు నియోజకవర్గంలో పరిస్థితి. ఇప్పటివరకు అనుమతుల్లేకుండా నాపరాయి తవ్వకాలు..సుంకం చెల్లించకుండా ఎగుమతులు..కల్తీ మద్యం తయారీ..కాగ్నా నదిలో ఇసుక రవాణాకు పాల్పడిన ఉదంతాలు వెలుగు చూశాయి. తాజాగా అనుమతుల్లేకుండా డీజిల్‌ బంకు ఏర్పాటు చేసి విక్రయాలకు తెరలేపారు. కొన్ని నెలలుగా సాగుతున్న ఈ వ్యవహారంపై ‘ఈనాడు’లో మంగళవారం ‘బయో డీజిల్‌ పేరిట దందా..’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఎస్‌ఐ ఏడుకొండలు, గిర్దావర్‌ రాజురెడ్డిలు సిబ్బందితో గౌతాపూర్‌లోని బయో డీజిల్‌ బంకు వద్దకు చేరుకున్నారు. బంకు యాజమాని రాంశెట్టి, నిర్వాహకులు కేవీఆర్‌ వెంకటేష్‌లను విచారించారు. బంకు ఏర్పాటుకు తీసుకోవాల్సిన అనుమతులు, జాగ్రత్తలపై ఆరా తీయగా ఎలాంటి అనుమతులు, జాగ్రత్తలు పాటించనట్లు తేల్చారు. రెవెన్యూ, పెట్రోలియం శాఖ, జిల్లా పాలనాధికారిణి, రహదారులు భవనాల శాఖ, పంచాయతీల నుంచి అనుమతులులేనట్లు గుర్తించారు. బంకు ప్రాంగణ కొలత తీసి వివరాలు నమోదు చేశారు. ట్యాంకరులో ఉంచిన డీజిల్‌ నిల్వలను పరిశీలించి నమోదు చేశారు. కర్ణాటక, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో రూ.72కు లీటరు చొప్పున బయో డీజిల్‌ తెచ్చి ఇక్కడ లీటరు రూ.82కు విక్రయిస్తున్నట్లుగా గుర్తించి వివరాలు నమోదు చేశారు.  బంకుకు తాళాలు వేయించి మూసివేయించారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేసి విక్రయదారులపై రెండురోజుల్లోగా చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.   


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని