రోడ్డెక్కితే... బురద పడినట్లే..!
eenadu telugu news
Published : 22/09/2021 00:38 IST

రోడ్డెక్కితే... బురద పడినట్లే..!

ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌: పరిగి తహసీల్దార్‌ కార్యాలయం నుంచి నస్కల్‌ దారిలో 1.5 కి.మీ. పొడవునా రహదారి విస్తరణ అభివృద్ధికి రూ.2.80 కోట్లు మంజూరు చేశారు. ఆరు నెలల క్రితం పనులు ప్రారంభించారు. ఉన్న రోడ్డును తవ్వి, డివైడర్లు ఏర్పాటు చేస్తున్నారు. రెండు వైపులా కంకర పరిచారు. ఇటీవల కురిసిన వర్షాలకు రహదారి మొత్తం అడుగడుగునా గుంతలమయంగా మారిపోయింది. కంకర కొట్టుకు పోయింది. మరో వైపు కోర్టు కూడలి నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు నిర్మాణంలో ఉన్న రోడ్డు సైతం ఇదే పరిస్థితికి చేరింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కారు, బస్సు, ఇతర వాహనాలు వచ్చినపుడు ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారికి, రహదారికి పక్కగా ఉన్నవారిపైనా గుంతల్లోని బురద నీళ్లు పడుతున్నాయి. దారి పొడవునా వేల గుంతలు ఉంటాయని, కనీసం ఇప్పుడైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని