అండర్‌-19 క్రికెట్‌ జట్టుకు శ్రీహన్సిక ఎంపిక
eenadu telugu news
Published : 22/09/2021 03:53 IST

అండర్‌-19 క్రికెట్‌ జట్టుకు శ్రీహన్సిక ఎంపిక

బండ్లగూడజాగీర్‌, న్యూస్‌టుడే: గండిపేట మండలం బండ్లగూడజాగీర్‌ నగరపాలిక పరిధిలోని హైదర్షాకోట్‌కు చెందిన పెద్దిరెడ్డి శ్రీహన్సిక తెలంగాణ రాష్ట్రస్థాయి మహిళా క్రికెట్‌ అండర్‌-19 జట్టుకు ఎంపికైంది. 500 మంది క్రీడాకారిణులు అండర్‌-19 సెలెక్షన్‌ కోసం వెళ్లగా, వీరిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన శ్రీహన్సిక ఎంపికైంది. ఈనెల 28 నుంచి గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో అండర్‌-19 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నట్లు కోచ్‌ పత్తిక ప్రవీత్‌కుమార్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని