రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి
eenadu telugu news
Published : 22/09/2021 03:53 IST

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

రాయదుర్గం, న్యూస్‌టుడే: బైకుపై వేగంగా దూసుకొచ్చి ముందు వెళ్తున్న మరో స్కూటీని ఢీ కొట్టిన సంఘటనలో బైకు నడిపిస్తున్న వ్యక్తి మృతి చెందగా మరో ముగ్గురు గాయాల పాలయ్యారు. వారిలో ఒకరి కాలు తెగిపడింది. ఈ ఘటన మాదాపూర్‌లో జరిగింది. మల్కాజిగిరి భవాని నగర్‌, సూర్యాటవర్స్‌లో నివసించే జె.రాహుల్‌(27) వ్యాల్యూల్యాబ్స్‌ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా పని చేస్తుంటారు. మంగళవారం తెల్లవారుజామున ఆయన తన ద్విచక్రవాహనంపై స్నేహితుడు.. నాగార్జున(26)నతో కలిసి వెళ్తుండగా అలంఘీర్‌ మసీదు సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న స్కూటీని ఢీకొట్టాడు. ఈ ఘటనలో రాహుల్‌ తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించగా. చికిత్స పొందుతూ మృతి చెందారు. నాగార్జున ఎడమ కాలు తెగి శరీరం నుంచి వేరై పక్కన పడింది. స్కూటీపై వెళ్తున్న ఎండీ నొవమన్‌ నిషాద్‌(26), సునీల్‌ దత్‌(23) గాయాలపాలయ్యారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని