ఉరివేసి.. 12చోట్ల కత్తితో పొడిచి..
eenadu telugu news
Updated : 22/09/2021 12:41 IST

ఉరివేసి.. 12చోట్ల కత్తితో పొడిచి..

కేశవగిరి, న్యూస్‌టుడే: ఓ పాతనేరస్థుడిని దుండగులు దారుణంగా హతమార్చి.. నగ్న స్థితిలో ఉన్న మృతదేహాన్ని ఆటోలో తరలించి పాతబస్తీ లేక్‌వ్యూ హిల్స్‌లోని నిర్మానుష్య ప్రదేశంలో పడేశారు. చాంద్రాయణగుట్ట ఇన్‌స్పెక్టర్‌ కె.ఎన్‌.ప్రసాద్‌వర్మ కథనం ప్రకారం.. ఉదయపు నడకకు లేక్‌వ్యూ హిల్స్‌కు వెళ్లిన కొందరు అక్కడి రోడ్డుపై యువకుడు హత్యకు గురై ఉన్నాడని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చేరుకొని సుమారు 26 ఏళ్ల వయసున్న యువకుడిని హత్యచేసి తీసుకువచ్చి పడేసినట్లు గుర్తించారు. క్లూస్‌ టీం ఆధారాలు సేకరించింది. పోలీసు జాగిలాలతో దర్యాప్తు చేయగా గౌస్‌నగర్‌, మహావీర్‌ కళాశాల దిశల్లో 2 కిలోమీటర్లు వెళ్లి ఓ షెట్టర్‌ వద్ద ఆగిపోయాయి. దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్‌, అదనపు డీసీపీ సయ్యద్‌ రఫీక్‌, ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్‌ మజీద్‌ పరిశీలించారు. మృతుడి శరీరంపై దాదాపు 12 చోట్ల కత్తిగాట్లు ఉన్నాయి. మృతుడు కుల్సుంపురా ఠాణా టోలీ మసీదుకు చెందిన మహ్మద్‌ ఆసిఫ్‌గా గుర్తించారు. తల్లి పర్వీన్‌బేగం ఆసిఫ్‌ మృతదేహాన్ని గుర్తుపట్టారు. సోమవారం రాత్రి ఆసిఫ్‌ స్నేహితుల వెంట వెళ్లినట్లు ఆమె తెలిపారు. తల్లి ఫిర్యాదు మేరకు చాంద్రాయణగుట్ట, ఆసిఫ్‌నగర్‌, టప్పాచబుత్రా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని