సైబర్‌ నేరాలపై కన్నేయాలి: హోంమంత్రి
eenadu telugu news
Published : 22/09/2021 03:53 IST

సైబర్‌ నేరాలపై కన్నేయాలి: హోంమంత్రి

సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులతో మహమూద్‌ అలీ

ఈనాడు, హైదరాబాద్‌: పిల్లలు సైబర్‌ నేరాల బారిన పడకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రి మహమూద్‌ అలీ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో గణేష్‌ నిమజ్జనం తర్వాత శాంతిభద్రతల పరిస్థితి, ఇతర అంశాలపై సమీక్షించేందుకు మంగళవారం తన కార్యాలయంలో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. హోంమంత్రి మాట్లాడుతూ.. నిమజ్జనం విజయవంతంగా పూర్తికావడానికి కృషి చేసిన డీజీపీ మహేందర్‌రెడ్డి, సీపీలు అంజనీకుమార్‌, మహేష్‌ భగవత్‌, స్టీఫెన్‌ రవీంద్ర, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తాలను అభినందించారు. సైబర్‌ నేరాలు నియంత్రణ చర్యల్లో భాగంగా విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

*● హాకా భవన్‌లోని భరోసా కేంద్రంలో మంగళవారం స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, బస్తీవాసులతో కలిసి హోంమంత్రి మాట్లాడారు. బస్తీలు, కాలనీల్లో చిన్నారులపై జరుగుతున్న లైంగిక వేధింపులను నిరోధించేందుకు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని