స్టేషన్‌ బెయిల్‌కు లంచం డిమాండ్‌
eenadu telugu news
Updated : 22/09/2021 04:15 IST

స్టేషన్‌ బెయిల్‌కు లంచం డిమాండ్‌

అనిశా వలకు చిక్కిన కానిస్టేబుల్‌

యాదయ్య

మహేశ్వరం, న్యూస్‌టుడే: మహేశ్వరం ఠాణాలో మంగళవారం అనిశా అధికారులు దాడి చేసి రూ.25వేలు లంచం తీసుకుంటున్న కానిస్టేబుల్‌ యాదయ్యను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. జిల్లా అనిశా డీఎస్పీ సూర్యనారాయణ వివరాల మేరకు.. పోరండ్ల గ్రామానికి చెందిన దయ్యాల బాల్‌రాజ్‌తో పాటు ఐదుగురు అన్నదమ్ములపై భూవివాదంలో మహేశ్వరం ఠాణాలో కేసు నమోదైంది. 41ఏ సీఆర్‌పీసీ కింద నోటీస్‌తో పాటు స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వడానికి ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో పనిచేసే కానిస్టేబుల్‌ యాదయ్య(రైటర్‌) రూ.25వేలు డిమాండ్‌ చేసినట్లు తెలిపారు. ఇందులో ఎస్సైకు రూ.20వేలు, కానిస్టేబుల్‌కు రూ.5వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేయగా బాధితుడు బాల్‌రాజ్‌ అనిశా అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం ఠాణాలో రూ.25వేలు లంచం తీసుకుంటుండగా యాదయ్యను అనిశా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిపారు. ఎస్సై శ్రీనివాస్‌రెడ్డిని విచారిస్తున్నారు. యాదయ్యను అరెస్ట్‌ చేశామని, బుధవారం అనిశా కోర్టులో రిమాండ్‌ చేయనున్నట్లు డీఎస్పీ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని