చోరీ కేసు నిందితుల వేటలో పోలీసులు
eenadu telugu news
Published : 22/09/2021 03:53 IST

చోరీ కేసు నిందితుల వేటలో పోలీసులు


టెలికాం నగర్‌లో వాచ్‌మన్‌ గది

రాయదుర్గం, న్యూస్‌టుడే: గచ్చిబౌలి టెలికం నగర్‌లో ఇంట్లో చోరీ కేసు నిందితుల వేటను పోలీసు బృందాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు బృందాలు తరలి వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తన ఇంట్లోంచి రూ.70 లక్షల విలువైన నగలు, రూ.15 లక్షలు నగదు చోరీకి గురైనట్లు బాధితుడు గోవిందరావు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పరారీలో ఉన్న తన ఇంటి వాచ్‌మెన్‌ దంపతులు (నేపాల్‌కు చెందిన లక్ష్మణ్‌, పవిత్ర) అపహరించుకెళ్లినట్లు ఫిర్యాదు ఇచ్చారు. పటాన్‌ చెరులో వారు తచ్చాడినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించడంతో పోలీసులు ఆ దిశగా గాలింపు చేపడుతున్నారు. గోవిందరావు ఇంట్లో గతంలో 6నెలలపాటు పని చేసిన యంలాల్‌ అనే వ్యక్తి పాత్రపైనా దృష్టి కేంద్రీకరించారు. వీరంతా కలిసే పథకం ప్రకారం వాచ్‌మెన్‌ను చేర్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. తనకు ఊళ్లో పని ఉందని, రెండు నెలలపాటు అక్కడే ఉంటానని యజమానికి చెప్ఫి. అతడే లక్ష్మణ్‌, పవిత్రలను చేర్పించాడు. కాగా ఆ జంట తామున్న గదిలో టీవీ, ఇతర సామగ్రిని వదిలేసి పరారయ్యారు. తొలుత యంలాల్‌ పనిలో కుదరడం, అతడు వెళ్లి మరో ఇద్దరిని చేర్పించడం ఇలా పథకం ప్రకారమే చేసినట్లు తెలుస్తోంది. నేపాలీ ముఠాల దోపిడీల ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని