విమానాశ్రయం నుంచి కిమ్స్‌కు 25 నిమిషాల్లో..
eenadu telugu news
Published : 22/09/2021 03:53 IST

విమానాశ్రయం నుంచి కిమ్స్‌కు 25 నిమిషాల్లో..

శంషాబాద్‌, న్యూస్‌టుడే: శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు అవయవాలను తరలించడానికి సైబరాబాద్‌, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు మంగళవారం మరోసారి గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేశారు. బెంగళూరులోని బాప్తిస్ట్‌ ఆసుపత్రి నుంచి ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమానంలో ఊపిరితిత్తులను వైద్య బృందం ఉదయం 10 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి తీసుకొచ్చారు. ఇక్కడి నుంచి 36.8 కి.మీ దూరంలో ఉన్న కిమ్స్‌ ఆసుపత్రి వరకు గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేయడంతో.. ప్రత్యేక అంబులెన్స్‌ ద్వారా 25 నిమిషాల్లో గమ్యస్థానానికి చేర్చారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని