హైదరా‘బాధ’లు తీర్చేలా ఆకాశమార్గాలు
eenadu telugu news
Updated : 22/09/2021 11:06 IST

హైదరా‘బాధ’లు తీర్చేలా ఆకాశమార్గాలు

 నగరంలో 21 చోట్ల కొనసాగుతున్న పైవంతెనల నిర్మాణం

వచ్చే ఏడాదికి దాదాపు పూర్తి

ఈనాడు, సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

గరంలో రోజురోజుకీ జటిలమవుతున్న ట్రాఫిక్‌ సమస్య పరిష్కరించేందుకు సర్కార్‌ కసరత్తు మొదలుపెట్టింది. వ్యూహత్మక రహదారి అభివృద్ధి కార్యక్రమం(ఎస్‌ఆర్‌డీపీ) కింద అయిదేళ్ల క్రితం కీలకమైన కూడళ్లలో పైవంతెనలు, ఆకాశ మార్గాల నిర్మాణం, రోడ్ల విస్తరణపై దృష్టి సారించింది. కొన్ని రోడ్లను విస్తరించగా మరికొన్ని చోట్ల పైవంతెనల నిర్మాణం కొనసాగుతోంది. అధికశాతం పైవంతెనలు వచ్చే ఏడాదికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ పూర్తయితే చాలావరకు ట్రాఫిక్‌ ఇబ్బందులు తీరతాయి. ‘ఈనాడు’ క్షేత్రస్థాయిలో పరిశీలించగా కొన్ని చోట్ల పనులు చురుగ్గా జరుగుతుంటే మరికొన్ని చోట్ల నత్తనడకన సాగుతున్నాయి.


బొటానికల్‌ గార్డెన్‌- కొండాపూర్‌ ఆర్టీవో కార్యాలయం 

* వ్యయం: రూ.263 కోట్లు
* పొడవు: 2.5 కి.మీ.  
* వరుసలు: 3(ఒక వైపే)
* పనుల ప్రారంభం: 2017
* పూర్తికావాల్సింది: మార్చి, 2022
* ఏదశలో ఉంది: కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
* ఉపయోగం: మియాపూర్‌- గచ్చిబౌలి మార్గంలో ప్రతి గంటలో 9 వేల వాహనాలు తిరుగుతుంటాయి. పలు చోట్ల ట్రాఫిక్‌ స్తంభిస్తోంది. పైవంతెన పూర్తయితే ఈ ఇబ్బందులు తొలుగుతాయి. బొటానికల్‌ గార్డెన్‌ వద్ద అప్‌ ర్యాంప్‌పైకి ఎక్కి నేరుగా శిల్పారామం రోడ్డులోకి దిగొచ్చు.


నారాయణమ్మ ఇంజినీరింగ్‌ కళాశాల - ఖాజాగూడ కూడలి

 

* వ్యయం: రూ.333.55 కోట్లు
* పొడవు: 2.8 కి.మీ.
* వరుసలు : ఆరు    
* పనుల ప్రారంభం: 2018
* పూర్తికావాల్సింది: ఈఏడాది చివరకు.
* ఏదశలో ఉంది: సమయానికి పూర్తవ్వొచ్చు.
* ఉపయోగం: మెహిదీపట్నం నుంచి రాయదుర్గం, హైటెక్‌ సిటీ మార్గంలో గంటకు పది వేల వాహనాలు తిరుగుతున్నాయి. ప్రస్తుతం అరగంట పడుతోంది. పూర్తయితే పది నిమిషాల్లో దాటొచ్చు.


ఆరాంఘర్‌- శంషాబాద్‌  ఆవలికి

 

* వ్యయం: రూ.283 కోట్లు

*పొడవు: పది కి.మీ. 

* వరుసలు: ఆరు లైన్లు, రెండు వైపులా సర్వీస్‌ రోడ్డు
* పనుల ప్రారంభం: 2018
* పూర్తికావాల్సింది: ఈ ఏడాది ఆఖరుకు

* ఏ దశలో ఉంది: 2022 మధ్యలో  పూర్తవ్వొచ్చు.
* ఉపయోగం: విమానాశ్రయానికి వెళ్లే శంషాబాద్‌ రహదారిని ఎక్స్‌ప్రెస్‌ హైవేగా మార్చాలని కేంద్రం నిధులు మంజూరు చేసింది. పది కి.మీ. పరిధిలో నాలుగు పైవంతెనల నిర్మాణంతో తేలిగ్గా వెళ్లవచ్చు.  


ఇందిరాపార్కు- వీఎస్టీ జంక్షన్‌ స్టీల్‌ వంతెన

* వ్యయం: రూ.450 కోట్లు  
* పొడవు: 2.6 కి.మీ.
* వరుసలు: 4(రెండు వైపులా)
* పనుల ప్రారంభం: ఏడాది కిందట
* పూర్తికావాల్సింది: మరో ఆరు నెలల్లో  
* ఉపయోగం: ఆర్టీసీ క్రాస్‌రోడ్డు వద్ద ట్రాఫిక్‌ పద్మవ్యూహంలా మారింది. వేగంగా పూర్తిచేసేందుకు స్టీలు వంతెన ఎంచుకున్నారు. స్తంభాలు నిర్మిస్తే వంతెన త్వరగా అందుబాటులోకి వస్తుంది. రాకపోకలుసాఫీగా సాగుతాయి.  


ఉప్పల్‌ కూడలి - నారపల్లి 

* వ్యయం: రూ.623 కోట్లు

* పొడవు: ఏడు  కి.మీ.

* వరుసలు: ఆరు  

* పనుల ప్రారంభం: 2018

* పూర్తికావాల్సింది: ఈ ఏడాది చివరికి
* ఏ దశలో ఉంది: వచ్చే ఏడాది చివరికి పూర్తవ్వొచ్చు.
* ఉపయోగం: నగరం నుంచి వరంగల్‌ వైపు సాఫీగా సాగిపోవచ్చు.


చింతలకుంట చెక్‌పోస్టు - ఎల్బీనగర్‌ మెట్రో స్టేషన్‌ 

* వ్యయం: రూ.43 కోట్లు

* పొడవు: 940 మీటర్లు
* వరుసలు: 2(ఒకవైపే)

* పనుల ప్రారంభం: 2017
* పూర్తికావాల్సింది: మార్చి, 2022

* ఏదశలో ఉంది: రెండు మూడు నెలలు ఆలస్యం కావొచ్చు.  
* ఉపయోగం: అత్యంత రద్దీ కూడలి కావడంతో విజయవాడ వైపు నుంచి నగరంలోకి వెళ్లే వాహనాలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. పూర్తయితే  ఇబ్బందులు తీరినట్లే.


చాంద్రాయణగుట్ట - ఒవైసీ కూడలి

* వ్యయం: రూ.37 కోట్లు

* పొడవు: అర కి.మీ.
*వరుసలు: 4  

* పనుల ప్రారంభం: 2019

* పూర్తి కావాల్సింది: జూన్‌, 2022
* ఏదశలో ఉంది: నిర్దిష్ట సమయానికి పూర్తి కావొచ్చు. 

* ఉపయోగం: ఈ మార్గంలో గంటకు 11 వేల వాహనాలు తిరుగుతుంటాయి. ఎల్బీనగర్‌, ఆరాంఘర్‌ మధ్య రాకపోకలు వేగంగా సాగుతాయి. శంషాబాద్‌ విమానాశ్రయానికి, శ్రీశైలం రహదారికి సులువుగా చేరుకోవచ్చు.


బహదూర్‌పుర పోలీసు స్టేషన్‌ - జూపార్కు 

* వ్యయం: రూ.69 కోట్లు

* పొడవు: 900 మీటర్లు(ఒకవైపే)
* వరుసలు: రెండు 

* పనుల ప్రారంభం: 2018
* పూర్తికావాల్సింది: మార్చి, 2022  
* ఏదశలో ఉంది: ఒక నెల అటు ఇటుగా పూర్చి కావొచ్చు.
* ఉపయోగం: వంతెన పూర్తయితే ఎంజీబీఎస్‌ నుంచి బెంగళూరు జాతీయ రహదారికి వాహనాలు ట్రాఫిక్‌ చిక్కులు లేకుండా సులభంగా చేరుకోవచ్చు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని