ప్రధాన మంత్రి ఉపాధి కల్పనలో పరిశ్రమల ఏర్పాటు
eenadu telugu news
Published : 23/09/2021 01:34 IST

ప్రధాన మంత్రి ఉపాధి కల్పనలో పరిశ్రమల ఏర్పాటు


మాట్లాడుతున్న నారాయణరావు

వికారాబాద్‌టౌన్‌: ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా అందించే రాయితీ నిధులను సద్వినియోగం చేసుకోవాలని, వ్యక్తిగత, బృందాల వారీగా లబ్ధిపొందాలని రాష్ట్ర నోడల్‌ అధికారి నారాయణరావు అన్నారు. బుధవారం వికారాబాద్‌ పట్టణం అంబేడ్కర్‌ భవన్‌లో ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ ఆధ్వర్యంలో పథకంపై నిరుద్యోగ యువతి, యువకులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా కుటీర పరిశ్రమలు, వ్యక్తిగత వ్యాపారాలు ఏర్పాటు చేసుకుని స్వశక్తితో ఆర్థికంగా బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ఆసక్తి ఉన్న వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 18ఏళ్లు పైబడిన వారు, స్వయం సహాయక బృందాలు, సహకార సంఘాలు ఆర్థిక సాయం పొందేందుకు అవకాశం ఉందన్నారు. చేపట్టే ప్రాజెక్టుల వారీగా రూ.25 లక్షలు, రూ.10 లక్షలు, రూ.5 లక్షలు మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. కనీసం 8వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జి శ్రీనివాస్‌రావు, నిపుణులు భూమయ్య, కుమారస్వామి, బ్యాంకు ఎల్‌డీఎం రాంబాబు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని