వర్షం తెచ్చిన కష్టం.. స్తంభించిన శ్రామిక జీవనం
eenadu telugu news
Published : 23/09/2021 01:34 IST

వర్షం తెచ్చిన కష్టం.. స్తంభించిన శ్రామిక జీవనం


నాపరాయి పరిశ్రమలోకి చేరిన వరద

తాండూరు గ్రామీణ: తాండూరు మండల పరిధి గ్రామాల్లో మంగళవారం రాత్రి, బుధవారం భారీ వర్షం కురిసింది. దీంతో గౌతాపూర్‌, అల్లాపూర్‌, చెంగెష్‌పూర్‌ పరిధిలోని నాపరాయి పరిశ్రమల ప్రాంగణంలో వరదనీరు చేరింది. ఫలితంగా కార్మికులు పనులు మానుకోవాల్సి రావడంతోపాటు నివాసాల్లోనూ ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మల్కాపూర్‌, ఓగీపూర్‌ గనుల్లోకి వరదనీరు చేరి కుంటలు, ఈత కొలనులను తలపిస్తున్నాయి. నాపరాయి ఎగుమతులపై ప్రభావం పడి లోడింగ్‌, అన్‌ లోడింగ్‌ కార్మికులు ఉపాధి కోల్పోయారు.

తాండూరు టౌన్‌ (న్యూస్‌టుడే): వానొస్తే.. వరదే అన్న చందంగా పట్టణ పరిస్థితి మారుతోంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో పట్టణ రోడ్లపై నీరు నిలిచింది. రోడ్లకు ఇరువైపులా మురుగు కాల్వలు ఎత్తులో ఉండటం, ఆక్రమణకు గురి కావటంతో నీరు రోడ్ల మీదనే నిలుస్తోంది. నేతాజి కూడలి నుంచి జిల్లా ఆస్పత్రి మార్గం, ఆర్టీసీ బస్టేషన్‌ వద్ద నుంచి తులసీనగర్‌, ఆదర్శనగర్‌ కాలనీ, సాయిపూరు వెళ్లే దారిలో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని