పౌరుడిపై దాడి చేసిన సర్పంచి రిమాండ్‌
eenadu telugu news
Published : 23/09/2021 01:34 IST

పౌరుడిపై దాడి చేసిన సర్పంచి రిమాండ్‌


దామస్తాపూర్‌లో వివరాలు అడుగుతున్న ఇన్‌ఛార్జి ఎంపీడీఓ వెంకట్‌రాం గౌడ్‌

మర్పల్లి, న్యూస్‌టుడే: తాగునీటి సమస్య పరిష్కరించాలని అడిగినందుకు అమానుషంగా పౌరుడిపై దాడి చేసిన సర్పంచిని రిమాండ్‌కు తరలించిన సంఘటన ఇది. మర్పల్లి ఠాణా పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ. వెంకటశ్రీను తెలిపిన వివరాల ప్రకారం.. దామస్తాపూర్‌ గ్రామానికి చెందిన సర్పంచి జైపాల్‌రెడ్డి మరో వ్యక్తితో రెండు రోజుల క్రితం జరిగిన తగాదాల విషయమై మాట్లాడుతున్నారు. అదే గ్రామానికి చెందిన పిట్టెల శ్రీనివాస్‌ మధ్యలో కలుగజేసుకున్నాడు. గ్రామంలో నీటి సమస్యను ప్రస్తావించాడు. దీంతో మధ్యలో వచ్చి మాట్లాడుతావా? అంటూ.. ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన సర్పంచి అతడిపై దాడి చేసి గాయపర్చిన విషయం తెలిసిందే. బుధవారం సర్పంచిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఘటనపై విచారణ.. పౌరుడిపై దాడి చేసిన విషయం తెలుసుకొని ఇన్‌ఛార్జి ఎంపీడీఓ వెంకట్‌రాంగౌడ్‌ గ్రామానికి వెళ్లి సంఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. దాడి ఎందుకు చేశాడు? గ్రామంలో సమస్యలు ఏమైనా ఉన్నాయా? వ్యక్తి గత కక్షలు ఉండేవా? అని ఆరా తీశారు. వ్యక్తిగతంగా ఇద్దరికీ ఎలాంటి వైరం లేదని, నీటి విషయంలోనే గొడవ జరిగిందని పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని