TS News: బిల్లు కట్టకపోతే నల్లా కట్‌.. 
eenadu telugu news
Updated : 23/09/2021 09:44 IST

TS News: బిల్లు కట్టకపోతే నల్లా కట్‌.. 

 

ఈనాడు, హైదరాబాద్‌: అత్యధిక ఆదాయం సమకూర్చే గృహేతర, వాణిజ్య నల్లాలపై జలమండలి దృష్టి సారించింది. బిల్లులు చెల్లించని నల్లాలతోపాటు చాలా కాలంగా ఛార్జీలు చెల్లించని కనెక్షన్లు తొలగించాలని నిర్ణయించింది. బుధవారం అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో యుద్ధప్రాతిపదిన చర్యలు తీసుకోవాలని ఎండీ దానకిషోర్‌ ఆదేశించారు. గ్రేటర్‌ వ్యాప్తంగా 12 లక్షల నల్లాలు ఉండగా, 10 లక్షల గృహ నల్లాలు ఉచిత నీటి పథకం కిందకు చేరాయి. బోర్డు ఆదాయంలో 70 శాతం గృహేతర(40 ఎంఎం సైజు పైన), వాణిజ్య(కమర్షియల్‌) నల్లాల ద్వారానే సమకూరుతోంది. వీటిపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడుతోంది. ఇటీవలి జీడిమెట్లలో ఓ వ్యక్తి ఏఎంఆర్‌ మీటర్‌ను టాంపర్‌ చేసి జలమండలికి టోకరా వేశాడు. ఇందులో సిబ్బంది హస్తం ఉందని ఆరోపణలు వచ్చాయి. వచ్చే మూడు నెలల్లో ఆయా నల్లాల నుంచి 100 శాతం బకాయిలు వసూలు చేయాలని తాజాగా నిర్ణయించారు. ఇవి రూ.వెయ్యి కోట్ల వరకు ఉన్నాయి. మరో రూ.700 కోట్లు ప్రైవేటు సంస్థల నుంచి వసూలు కావాల్సి ఉంది. వివిధ విభాగాల వివరాలను పక్కాగా నమోదు చేసేందుకు మొబైల్‌ యాప్‌ను రూపొందించనున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని